'లవ్ యూ నాన్న'.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
Hero Maheshbabu emotional letter to his father krishna. సూపర్ స్టార్ కృష్ట ఇటీవల తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన
By అంజి
సూపర్ స్టార్ కృష్ట ఇటీవల తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ హీరో మహేష్‌బాబు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ''మీ జీవితం గొప్పగా సాగింది. మీ నిష్క్రమణ కూడా అంతే గొప్పగా జరిగింది. అదంతా మీ గొప్పతనం. మీరు భయం లేకుండా డేరింగ్, డాషింగ్‌గా జీవితాన్ని గడిపారు. అదే మీ వ్యక్తిత్వం. మీరే నాకు స్ఫూర్తి, ధైర్యం. అన్ని విషయాల్లో నేను మిమ్మల్ని అనుసరించాను. కానీ, ప్రస్తుతం అవన్ని లేవు. అయినప్పటికి, నేను భయం లేకుండా ఉన్నాను. మీరిచ్చిన ధైర్య సాహసాలు ఎప్పటికి నాతోనే ఉంటాయి. మీ వారసత్వాన్ని నేను ఎప్పుడు ముందుకు తీసుకువెళుతుంటాను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్న. నా సూపర్ స్టార్ మీరు'' అని మహేశ్ బాబు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.
— Mahesh Babu (@urstrulyMahesh) November 24, 2022
సూపర్ స్టార్ మహేష్‌బాబుకు ఈ ఏడాది అత్యంత విషాదంగా మారింది. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు సోదరుడు రమేష్‌బాబు ఆయనకు దూరం అయ్యారు. దీంతో మహేష్‌బాబు తీవ్ర దుఖః సాగరంలో మునిగిపోయారు. ఈ ఏడాది జనవరిలో రమేశ్‌బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడిన ఆయన పరిస్థితి విషమించడంతో జనవరి 8న తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో మహేష్‌బాబు కరోనాతో బాధపడుతుండడంతో కనీసం చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయాడు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే తల్లి ఇందిమా దేవి దూరమైంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ సెప్టెంబర్‌లో మరణించింది. ఇక నవంబర్ 15వ తేదీన తండ్రి కృష్ణ మరణించారు.