ధనుష్ 'సార్' ఫస్ట్‌లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా..
Hero Dhanush new movie sir first look poster released. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తమిళ హీరో ధనుష్ ముందు వరుసలో ఉంటారు.
By అంజి Published on 27 July 2022 1:22 PM ISTవిలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తమిళ హీరో ధనుష్ ముందు వరుసలో ఉంటారు. డిఫరెంట్ సినిమాలను చేస్తూ, ప్రేక్షకులను మెప్పిస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. 'ది గ్రే మ్యాన్' సినిమాతో ధనుష్ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరైన ధనుష్ తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. అయితే ధనుష్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న తాజా మూవీ 'సార్' ఫస్ట్‌లుక్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.
రేపు ధనుష్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే 'సార్' మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే సినిమాకు సంబంధించిన మరో అప్డేట్‌ను కూడా ఇచ్చారు. రేపు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. కాగా ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గమనిస్తే.. ధనుష్ లైబ్రరీలో ఏదో పుస్తకం చదువుతున్నట్లు తీక్షణంగా చూస్తంటాడు. టేబుల్ లైటింగ్ ల్యాంప్ వెలుతురులో డిఫరెంట్ లుక్‌లో సీరియస్‌గా కనిపిస్తున్నాడు. పోస్టర్ చూస్తుంటే టైటిల్‌కు తగినట్లే ఉందనిపిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ పతాకాలపై సితార నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య, నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. సాయి కుమార్, తణికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు.