సంచలనాత్మక కథాంశంతో రూపొందిన సినిమా.. ఓటీటీలో..!

యామీ గౌతమ్, ప్రియమణి నటించిన ఆర్టికల్ 370 సినిమా స్లీపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 110 కోట్లు వసూలు చేసి మంచి హిట్‌గా నిలిచింది

By Medi Samrat  Published on  19 April 2024 8:14 PM IST
సంచలనాత్మక కథాంశంతో రూపొందిన సినిమా.. ఓటీటీలో..!

యామీ గౌతమ్, ప్రియమణి నటించిన ఆర్టికల్ 370 సినిమా స్లీపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 110 కోట్లు వసూలు చేసి మంచి హిట్‌గా నిలిచింది. ఆర్టికల్ 370ని తొలగించిన నేపథ్యంలో ఈ చిత్రం కూడా చాలా వివాదాలను కేంద్ర బిందువుగా మారింది. కొందరు ఈ చిత్రం వాస్తవాలను వక్రీకరించిందని ఆరోపించారు. మరికొందరు ఇది ప్రచార చిత్రం అని కూడా ఆరోపించారు.

ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. ఆర్టికల్ 370 OTT జెయింట్, నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఈ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే ప్రసారం అవుతుంది. డబ్బింగ్ వెర్షన్ ఇంకొన్ని రోజుల తర్వాత ప్రసారం చేయవచ్చు. ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. కశ్మీర్ ప్రాంతంపై ఆర్టికల్ 370 తొలగింపుకు కారణాలు, ఆ తర్వాత జరిగిన ఘటనలు ఈ సినిమాలో చూపించారు. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ తర్వాత ఈ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది.

Next Story