ఆ స్టార్ కమెడియన్.. ఓ సామాజిక వర్గాన్ని కించపరిచాడా..?

Complaint on Yogi Babu's New Movie Mandela. యోగి బాబు హీరోగా నటించిన కొత్త చిత్రం మండేలా సినిమాలోని కొన్ని సన్నివేశాలు త‌మ‌ను కించ పర్చేలా ఉన్నాయంటూ నాయీ బ్రాహ్మణులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

By Medi Samrat  Published on  11 April 2021 6:16 PM IST
yogi babu

త‌మిళ‌ నటుడు యోగిబాబు.. చాలా బిజీ..! ఒక వైపు కమెడియన్ గా నటిస్తూ.. మరో వైపు హీరోగా పలు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నాడు. యోగి బాబు హీరోగా నటించిన కొత్త చిత్రం మండేలా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా తమిళనాడు రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంది. ఇందులో నాయీ బ్రాహ్మణుడి పాత్రలో న‌వ్వులు పూయించే ప్ర‌య‌త్నం చేశాడు.

ఈ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. మండేలా సినిమాలోని కొన్ని సన్నివేశాలు త‌మ‌ను కించ పర్చేలా ఉన్నాయంటూ నాయీ బ్రాహ్మణులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు తమిళనాడు నాయీ బ్రాహ్మణ కార్మికుల సంక్షేమ సంఘం చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

త‌మ‌ను కించ‌ప‌ర్చేలా స‌న్నివేశాలు ఉండ‌డ‌మే కాకుండా వైద్య రంగానికి చెందిన 40 లక్షల మంది మనోభావాలు దెబ్బ‌తినేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయ‌ని తెలిపింది. ఆ సినిమా దర్శక, నిర్మాతలతో పాటు యోగిబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నాయీ బ్రాహ్మ‌ణ సంఘం కోరింది. పలువురు నాయీ బాహ్మణులు యోగి బాబు తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఉన్నారు. స్టార్ కమెడియన్ గా ఎంతో బిజీగా ఉన్న యోగి బాబుకు సరికొత్త చిక్కులు వచ్చాయి.


Next Story