'తండేల్' సినిమా సెన్సార్ రిపోర్టు ఇదే

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన కొత్త చిత్రం తండేల్. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుంటూ ఉంది.

By అంజి
Published on : 30 Jan 2025 1:15 PM IST

Thandel movie, censor report, Tollywood, Naga Chaitanya, Sai Pallavi

'తండేల్' సినిమా సెన్సార్ రిపోర్టు ఇదే

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన కొత్త చిత్రం తండేల్. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుంటూ ఉంది. ఇందులో నాగ చైతన్య మత్స్యకారుడి పాత్రను పోషించాడు. తన ప్రియురాలి ప్రేమను తిరిగి పొందడానికి అతడు చేసే ప్రయత్నం ఈ సినిమాలో చూడొచ్చు. పాకిస్థాన్ జైలులో చిక్కుకుపోయిన మత్స్యకారుడు అక్కడి నుండి ఎలా బయటపడతాడు.. చివరికి అనుకున్న గమ్యానికి చేరుకుంటాడా అన్నది సినిమాలో చూడాలి. సాయి పల్లవి మెయిన్ లీడ్ గా నటించింది.

ఇక ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా పూర్తయింది. తండేల్ సినిమాకు U/A సర్టిఫికేట్‌ సెన్సార్ చేశారు. 145 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉంది. ఇది ఖచ్చితంగా సినిమాకు సరైన రన్‌టైమ్. ఇప్పటి వరకు నాగ చైతన్య నటించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం తండేల్. ట్రైలర్‌లో లీడ్ పెయిర్ గ్రిప్పింగ్, ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు, సినిమాలో మంచి యాక్షన్ ఎపిసోడ్‌లు కూడా ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ లో హయ్యెస్ట్‌ కలెక్షన్స్ సాధించే చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Next Story