హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప‌వ‌ర్ గ్లాన్స్ వ‌చ్చేసింది.. గూస్ బంప్స్ ప‌క్కా

Hari Hara Veera Mallu Power Glance Out Now.సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో హరిహ‌ర వీర‌మ‌ల్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sept 2022 10:47 AM IST
హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప‌వ‌ర్ గ్లాన్స్ వ‌చ్చేసింది.. గూస్ బంప్స్ ప‌క్కా

సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'హరిహ‌ర వీర‌మ‌ల్లు' ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ న‌టిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఈ రోజు ప‌వ‌ర్ స్టార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప‌వ‌ర్ గ్లాన్స్ వ‌చ్చేసింది. ఓ ప్ర‌త్యేక వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

"మెడ‌ల్ని వంచి క‌థ‌లి మార్చి, కొలిక్కి తెచ్చే ప‌నెట్టుకొని.. తొడ‌కొట్టాడో తెలుగోడు" పాట‌తో వీడియో మొద‌లైంది. ఇందులో ప‌వ‌న్ మేన‌రిజం, ప‌వ‌ర్‌పుల్‌గా ఉంది. మ‌ల్ల‌యోధుల‌తో ఆయ‌న పోరాటం చేస్తున్న దృశ్యాలు ఆక‌ట్టుకుంటున్నాయి. కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మొత్తానికి ఈ వీడియో మాత్రం అదిరిపోయింద‌నే చెప్పాలి.

Next Story