అంగరంగ వైభవంగా హీరోయిన్‌ హన్సిక వివాహం

Hansika Motwani And Sohael Khaturiyas Wedding Videos. అంగరంగ వైభవంగా హీరోయిన్‌ హన్సిక వివాహం

By అంజి  Published on  5 Dec 2022 1:45 PM IST
అంగరంగ వైభవంగా హీరోయిన్‌ హన్సిక వివాహం

సినీ హీరోయిన్‌ హన్సిక మోత్వానీ పెళ్లి ఘనంగా జరిగింది. వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియాతో హన్సిక ఏడడుగులు వేసింది. వీరి వివాహం నిన్న రాత్ర జరగగా.. పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రాజస్థాన్‌ జైపూర్‌లోని ఓ కోటలో సింధీ సంప్రదాయం ప్రకారం వీరూ పెళ్లి చేసుకున్నారు. పలువురు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గత వారం నుంచే హన్సిక పెళ్లి సందడి మొదలైంది. శుక్రవారం నాడు సూఫీ నైట్‌ వేడుకను ఘనంగా జరిపారు. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా వధూవరులు పలు పాటలకు డ్యాన్సులు చేసి సందడి చేశారు.పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

సొహైల్ కు రెండో వివాహం కావడం గమనార్హం. హన్సిక స్నేహితురాలితోనే సొహైల్‌కు మొదటి పెళ్లి అయ్యింది. అయితే కొన్ని కారణాల వల్ల వారు విడిపోయారు. ఆ తర్వాత హన్సిక, సొహైల్ మధ్య ప్రేమ చిగురించింది. అది ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటైంది. తెలుగు, తమిళంలో హన్సిక ఎక్కువ సినిమాలు చేశారు. ఇటీవలే ఆమె 50వ సినిమా విడుదలయింది. అయితే ఇటీవల కాలంలో హన్సిక పెద్దగా సినిమాలు చేయడం లేదు. తాజాగా పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. సినిమాలు చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. పేద చిన్నారులకు సహాయం ఎన్జీవోలకు హన్సిక తన వంతు సాయం చేస్తున్నారు.




Next Story