బాలీవుడ్‌లో విషాదం.. 'గల్లీబాయ్' ర్యాపర్ హఠాన్మరణం
Gully Boy rapper MC Tod Fod aka Dharmesh Parmar dies at 24.బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. 24 ఏళ్ల చిన్న
By తోట వంశీ కుమార్ Published on 22 March 2022 7:18 AM GMTబాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. 24 ఏళ్ల చిన్న వయస్సులోనే 'గల్లీబాయ్' ర్యాపర్ ధర్మేశ్ పార్మర్ అలియాస్ ఎంసీ టాడ్ ఫాడ్ మరణించాడు. కాగా.. అతడి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నిన్న మరణించగా.. అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి. ఈ విషయాన్ని అతడు జట్టు కట్టిన స్వదేశీ యూట్యూబ్ చానెల్ తెలియజేసింది. అతడు స్వదేశీ కోసం చివరగా పాడిన పాటను పోస్టు చేసింది.
రణవీర్ సింగ్-సిద్ధాంత్ చతుర్వేది-నటించిన 'గల్లీ బాయ్' చిత్రంలోని 'ఇండియా 91' పాటకు తన గాత్రాన్ని అందించాడు ధర్మేశ్ పార్మర్. దానికి ర్యాప్ వెర్షన్ సృష్టించాడు. అది అతడికి ఎంతో పేరు తీసుకువచ్చింది. అతడి మరణం పై బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
'ఇంత చిన్న వయసులోనే వెళ్లిపోతావని ఊహించలేదు. నిన్ను కలిసినందుకు నేను చాలా గర్వపడుతున్నా. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. బాంటాయ్' అంటూ జోయా అక్తర్ ట్వీట్ చేసింది.
టాడ్ ఫాడ్ ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన రణ్ వీర్ సింగ్.. దానికి బ్రోకెన్ హాట్ సింబల్‌ను జతచేశాడు.
సిద్ధార్థ్ చతుర్వేది అతడితో చివరిసారిగా చేసిన చాట్‌నుపోస్ట్ చేయడంతో పాటు రెస్ట్ ఇన్ పీస్ బ్రదర్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.