షూటింగ్‌లో హీరో గోపిచంద్‌కు ప్ర‌మాదం

Gopichand injured on the sets of his next.హీరో గోపిచంద్ ఓ సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డాడు. ఫైట్ స‌న్నివేశాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2022 10:08 AM IST
షూటింగ్‌లో హీరో గోపిచంద్‌కు ప్ర‌మాదం

హీరో గోపిచంద్ ఓ సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డాడు. ఫైట్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా ఎత్తైన ప్రదేశం నుంచి ఆయ‌న‌ కాలు జారి కింద ప‌డ్డాడు.

వివ‌రాల్లోకి వెళితే.. శ్రీవాస్ దర్శకత్వంలో గోపిచంద్ ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. త‌న కెరీర్‌లో 30వ చిత్రంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రుగుతోంది. ఓ ఫైట్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అయితే.. డూప్ లేకుండానే గోపిచంద్ అందులో పాల్గొంటుండ‌గా.. ఆయ‌న ప్ర‌మాదానికి గుర‌య్యారు. షూటింగ్ స్పాట్‌లో కాస్త ఎత్తైన ప్ర‌దేశం నుంచి కాలు జారి కింద ప‌డ్డాడు.

ఈ విష‌యం తెలిసిన అభిమానులు ఆయ‌న‌కు ఏమైందోన‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీవాస్ స్పందించారు. అదృష్ట వ‌శాత్తూ గోపిచంద్‌కు ఎటువంటి గాయాలు కాలేద‌ని అన్నారు. ప్ర‌స్తుతం గోపిచంద్ క్షేమంగానే ఉన్నార‌ని తెలిపారు. ఎవ్వ‌రు కూడా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ఇదిలా ఉంటే.. గోపించంద్-శ్రీవాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ 'ల‌క్ష్యం', 'లౌక్యం' చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రం ఇది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రంలో గోపిచంద్ స‌ర‌స‌న డింపుల్ హ‌య‌తి న‌టిస్తోంది. జ‌గ‌ప‌తి బాబు, ఖుష్భూ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story