విషాదం.. ప్ర‌ముఖ‌ న‌టి, నిర్మాత మంజు సింగ్ క‌న్నుమూత‌

Gol Maal actress Manju Singh passes away.ప్ర‌ముఖ న‌టి, టీవీ షో ప్రొడ్యూస్య‌ర్‌, వ్యాఖ్య‌త అయిన మంజు సింగ్ క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2022 2:28 PM IST
విషాదం.. ప్ర‌ముఖ‌ న‌టి, నిర్మాత మంజు సింగ్ క‌న్నుమూత‌

ప్ర‌ముఖ న‌టి, టీవీ షో ప్రొడ్యూస్య‌ర్‌, వ్యాఖ్య‌త అయిన మంజు సింగ్ గుండెపోటుతో క‌న్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 74 సంవ‌త్స‌రాలు. ఈ విషయాన్ని గీత రచయిత, గాయకుడు, స్క్రీన్ రైటర్ స్వానంద్ కిర్కిరే సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. ఆమె మృతి ప‌ట్ల సంతాపం తెలియ‌జేశారు.

'మంజు సింగ్‌ ఇకలేరు. ఆమె దూరదర్శన్‌లో ప్రసారమయ్యే స్వరాజ్‌ షోకి రాసేందుకు నన్ను ఢిల్లీ నుంచి ముంబైకి తీసుకొచ్చారు. డీడీ కోసం ఏక్ కహానీ, షో టైమ్‌ మొదలైన అనేక అద్భుతమైన ప్రదర్శనలు రూపొందించారు. మా ప్రియమైన మంజు గారి ప్రేమను అందరూ ఎలా మరిచిపోగలరు. వీడ్కోలు..' అని స్వానంద్ కిర్కిరే ట్వీట్‌ చేశారు. ఆమె మృతి ప‌ట్ల ప‌లువురు సెలబ్రెటీలు సంతాపం తెలియ‌జేశారు.

'దీదీ' అని ముద్దుగా పిలుచుకునే ఆమె ఏడేళ్లపాటు నడిచిన ఖేల్ ఖిలోన్ అనే పిల్లల షోకి యాంకర్‌గా వ్యవహరించింది. హృషికేశ్ ముఖర్జీ యొక్క గోల్ మాల్ చిత్రంలో ర‌త్న అనే పాత్ర‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సృజనాత్మక కళలు, విద్యకు మంజు సింగ్ చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 2015లో 'సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (సీఎబీఈ)' కి ఆమెను నియమించింది.

Next Story