'పుష్ప' కోసం వేట ప్రారంభం.. మేకర్స్ వీడియో విడుదల
కోవిడ్ తర్వాత.. 'పుష్ప - ది రైజ్' సినిమా 2021లో ప్రేక్షకులను తిరిగి థియేటర్‌లకు తీసుకువచ్చిన మొదటి బ్లాక్‌బస్టర్.
By అంజి Published on 5 April 2023 5:30 PM IST
కోవిడ్ తర్వాత.. 'పుష్ప - ది రైజ్' సినిమా 2021లో ప్రేక్షకులను తిరిగి థియేటర్‌లకు తీసుకువచ్చిన మొదటి బ్లాక్‌బస్టర్. ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్‌లో అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 'పుష్ప- ది రూల్'కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పోస్టర్ రిలీజ్ కాలేదు. రెండు సంవత్సరాల తరువాత అల్లు అర్జున్ నటించిన సీక్వెల్‌పై భారీ అంచనాలను క్రియేట్ చేసేలా.. ప్రొడక్షన్ హౌస్ ఒక వీడియో క్లిప్‌ను విడుదల చేసింది.
'అసలు పుష్ప ఎక్కడ?' అంటూ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. తిరుపతి జైలు నుంచి పుష్ప పారిపోయాడని, ఇప్పుడు అతడి జాడ తెలియలేదని క్రిప్టిక్ వీడియో వివరించింది. మేకర్స్ మైత్రి మూవీస్.. అయితే ఈ ప్రశ్నకు ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం 4.05 నిమిషాలకు అభిమానులకు సమాధానం ఇస్తామని వాగ్దానం చేసింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్‌గా ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో రష్మిక మందనా హీరోయిన్‌గా నటిస్తోంది.
#WhereIsPushpa ?
— Pushpa (@PushpaMovie) April 5, 2023
The search ends soon!
- https://t.co/clOLWfGV6L
The HUNT before the RULE 🪓
Reveal on April 7th at 4.05 PM 🔥#PushpaTheRule ❤️🔥
Icon Star @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @SukumarWritings @MythriOfficial pic.twitter.com/ayodpfY45a