నా ముందే ముద్దు ఇస్తావా.. భర్తపై నటి జెనీలియా సీరియస్!

Genelia Jealous on ritiesh kiss preity hands.తెలుగు, హిందీ భాషల్లో తనదైన చలాకీ నటనతో ప్రేక్షకుల మనసు దోచింది జనీలియా.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2021 8:35 PM IST
నా ముందే ముద్దు ఇస్తావా.. భర్తపై నటి జెనీలియా సీరియస్!

తెలుగు, హిందీ భాషల్లో తనదైన చలాకీ నటనతో ప్రేక్షకుల మనసు దోచింది జెనీలియా. తెలుగు లో చేసిన చిత్రాలు తక్కువే అయినా అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించి అందరి మనసు దోచింది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. బాలీవుడ్ లో అందమైన కపుల్ అంటే వెంటనే ఈ జంట గురించే చెబుతారు. ఇటీవల హీరోయిన్‌ జెనీలియా చేతికి స్వల్ప గాయమైన విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు జనీలియా తన భర్తపై ఫైర్ అయ్యింది.. అది కూడా ఓ రేంజ్ లో బాక్సింగ్ చేస్తూ.. అసలు విషయం ఏంటంటే.. త‌న భర్త త‌న క‌ళ్ల ముందే మ‌రో మ‌హిళ‌కు కిస్ ఏవరికైనా కడుపు మంటగానే ఉంటుంది.

తన భర్త పరాయి స్త్రీని ముట్టుకున్నా.. ఆమెకు సన్నిహితంగా ఉంన్నా ఈర్శ్య‌ప‌డ‌ని ఆడ‌వాళ్లు ప్ర‌పంచంలో ఎవ‌రూ ఉండ‌రు. దీనికి సినిమా స్టార్ల‌యినా అతీతం కాదు. ఇప్పుడు జెనీలియాకు కూడా అదే కోపం వచ్చింది. త‌న భ‌ర్త రితేస్ దేశ్‌ముఖ్ త‌న ముందే బాలీవుడ్ న‌టి ప్రీతి జింటా చేతుల‌కు ముద్దు పెట్టాడు. పక్కనే ఉన్న జెనీలియా ముఖంలో తనకు తెలియకుండానే రక రకాల హావభావాలు ప్రదర్శించింది.

ఆ త‌ర్వాత ఇంటికి వ‌చ్చిన రితేష్‌ను జెనీలియా ఓ ఆటాడుకుంది. రితేష్.. ప్రీతికి కిస్ ఇవ్వ‌డం వ‌ర‌కూ నిజ‌మే కానీ.. జెనీలియా ఈర్శ్య‌ప‌డ‌టం, త‌ర్వాత ఇంటికి వ‌చ్చి రితేష్‌ను కొట్ట‌డం మాత్రం అంతా ఉత్తిదే. జెనీలియానే స‌ర‌దాగా ఓ ఫ‌న్నీ వీడియోను క్రియేట్ చేసి ట్విట‌ర్‌లో షేర్ చేసింది. ట్విస్ట్ ఏంటంటే ఇది ఇప్పటి సీన్ కూడా కాదు.. 2019లో ఐఫా అవార్డుల సంద‌ర్భంగా ప్రీతికి రితేష్ కిస్ ఇచ్చిన వీడియోను జెనీలియా ఇప్పుడిలా ఫ‌న్నీగా త‌యారు చేసింది.


Next Story