గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ నటి కియారా అద్వానీ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్ర ఖని, ఎస్ జే సూర్య, సునీల్, అంజలి, నవీన్ చంద్ర తదితర నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య గేమ్ ఛేంజర్ జనవరి 10న థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే విడుదలైన రోజే పైరసీ ప్రింట్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది.
ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ సినిమా రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే శంకర్ అదే పాత స్టోరీతో ప్రేక్షకుల ముందు రావడంతో భారీ నష్టాన్ని చవి చూసింది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. తాజాగా, ‘గేమ్ చేంజర్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమా ఓటీటీలో హక్కుల్ని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. ఫిబ్రవరి 7 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.