ఈ వారం ఓటీటీలోకి సూపర్ సినిమాలు వ‌స్తున్నాయ్‌.. ఎంజాయ్ చేయండి..!

ఎన్టీఆర్ నటించిన దేవర బాక్సాఫీస్ రన్ ముగిసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది

By Medi Samrat  Published on  7 Nov 2024 7:53 PM IST
ఈ వారం ఓటీటీలోకి సూపర్ సినిమాలు వ‌స్తున్నాయ్‌.. ఎంజాయ్ చేయండి..!

ఎన్టీఆర్ నటించిన దేవర బాక్సాఫీస్ రన్ ముగిసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. దేవరతో పాటు వెట్టయన్, జనక ఐతే గనక, ARM కూడా ఓటీటీలో సందడి చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో దేవర, అమెజాన్ ప్రైమ్ వీడియోలో వెట్టైన్, ఆహా వీడియోలో జనక ఐతే గనక, ARM డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానున్నాయి.

దేవర మినహా మిగిలిన 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. రజనీకాంత్ నటించిన వెట్టయాన్ భారీ హైప్ మధ్య విడుదలైంది కానీ విజయం సాధించలేకపోయింది. ఈ చిత్రం మొదటి వారాంతంలో మంచి కలెక్షన్స్ సాధించినా ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేదు. జనక ఐతే గనక బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించుకుంది. కానీ చూసిన వారంతా మంచి సినిమా అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక మలయాళ చిత్రం ARM కేరళలో మంచి కలెక్షన్స్ సాధించినా, మిగిలిన భాషల్లో పెద్దగా ఆడలేదు.

Next Story