తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్‌ రూ.కోటి విరాళం.. ఆ హీరో కూడా..

కన్నీటిలో సాయం కోసం ఎదురు చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం.. ఆయా ప్రభుత్వాలకు ఎన్టీఆర్‌ రూ.కోటి విరాళం ప్రకటించారు.

By అంజి  Published on  3 Sep 2024 5:15 AM GMT
Flood disaster, NTR , Telugu states, Tollywood

తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్‌ రూ.కోటి విరాళం.. ఆ హీరో కూడా..

ఊరులన్నీ ఏరులయ్యాయి. గూడు మునిగి గోడు మిగిలింది. కన్నీటిలో సాయం కోసం ఎదురు చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం.. ఆయా ప్రభుత్వాలకు ఎన్టీఆర్‌ రూ.కోటి విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్‌రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న బీభత్సం తనను ఎంతగానో కలచివేసిందని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని తాను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు తన వంతుగా చెరొక రూ.50 లక్షలు విరాళం ఇస్తున్నానని తెలిపారు.

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ సైతం తనకు తోచినంత రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తం అందించనున్నట్టు వెల్లడించారు. ఈ విపత్తు సమయంలో సహాయక చర్యలకు మద్దతుగా ఈ విరాళం ఇస్తున్నానని తెలిపారు. తన అభిమాన హీరో అయిన జూనియర్‌ ఎన్టీఆర్‌ విరాళం ప్రకటించిన కాసేపటికే విశ్వక్‌సేన్‌ ఈ ప్రకటన చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో సినీప్రముఖులు బాధితులకు అండగా నిలుస్తున్నారు ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్టు వైజయంతి మూవీస్‌ ప్రకటించింది. 'ఆయ్‌' సినిమా యూనిట్‌ సైతం వరద బాధితులకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించుకుంది.

Next Story