మొన్న బేషరమ్ రంగ్.. ఇప్పుడు 'ఝూమే జో పఠాన్' సాంగ్

first look of Shah Rukh Khan from Jhoome Jo Pathaan with Deepika Padukone out. పఠాన్ సినిమా నుండి విడుదలైన మొదటి సింగిల్ 'బేషరమ్ రంగ్' ఇప్పటికే ఎన్నో వివాదాలకు

By M.S.R
Published on : 20 Dec 2022 9:00 PM IST

మొన్న బేషరమ్ రంగ్.. ఇప్పుడు ఝూమే జో పఠాన్ సాంగ్

పఠాన్ సినిమా నుండి విడుదలైన మొదటి సింగిల్ 'బేషరమ్ రంగ్' ఇప్పటికే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైంది. తీవ్ర చర్చ కొనసాగుతూ ఉండగా.. ఈ సినిమాకు సంబంధించిన రెండవ పాట కూడా విడుదల కానుంది. 'ఝూమే జో పఠాన్' అంటూ ఈ రెండో పాట రానుంది. ఈ పాటకు సంబంధించి షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనేల స్టిల్‌ ఆకట్టుకుంటోంది. బేషరమ్ రంగ్ వివాదం తర్వాత 'ఝూమే జో పఠాన్' అనే రెండవ పాట ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. షారూఖ్ ఖాన్ పొడవాటి జుట్టుతో, దీపికా పదుకొణె హాట్ గా కనిపిస్తోంది. డిసెంబర్ 22న ఈ పాటను విడుదల చేయనున్నారు.

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం తొలిసారి కలిసి పఠాన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది. ఈ చిత్రం తమిళం, తెలుగులో డబ్బింగ్ వెర్షన్‌లలో విడుదల కాబోతోంది. రిపబ్లిక్ డే వారాంతంలో జనవరి 25, 2023 న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ రా ఫీల్డ్ ఏజెంట్ పఠాన్‌గా కనిపించనున్నారు. పఠాన్ సినిమాకు విశాల్-శేఖర్ సంగీతాన్ని ఇచ్చారు.



Next Story