తెలుగులో మొదటి ఇంటరాగేటివ్ సినిమాగా తెరకెక్కుతున్న 'ది ట్రయల్'
First Interogative film in Telugu is The Trail. ఎస్‌ఎస్ ఫిల్మ్స్, కామన్ మాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ''ది ట్రయల్".
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 April 2023 1:36 PM GMTThe Trail First Look Poster
ఎస్‌ఎస్ ఫిల్మ్స్, కామన్ మాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ''ది ట్రయల్". స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ముఖ్య తారాగణంగా రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మాతలు కాగా.. సుదర్శన్ రెడ్డి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
రంజాన్, అక్షయ తృతీయ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. సినిమా టైటిల్ కి తగ్గట్టుగా పోస్టర్ లో చూపించిన డీటైల్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇక పోస్టర్ పై సింహభాగం లో ఉన్న స్పందన పల్లి యొక్క మొహంలో ఏదో ఒక తెలియని బాధ కనిపిస్తుంది. అలాగే పోస్టర్ పైన ఇంటరాగేషన్ రూమ్ లో ఎస్సై వంశీ ఎదురుగా స్పందన పల్లి విచారణ ఎదుర్కోవటం మనం గమనించవచ్చు. తద్వారా ఈమె ఏమైనా తప్పు చేసి విచారణ ఎదుర్కుంటుందా? లేదా చేయని తప్పుకు ఇరుక్కుందా? అనేది టీజర్ లో చూడవచ్చేమోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ క్రమంలోనే టీజర్ ను త్వరలోనే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. ''ది ట్రయల్'' మూవీ తెలుగులో వస్తున్న మొట్టమొదటి ఇంటరాగేటివ్ చిత్రంగా నిలవనుంది.
నటుల విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నటించిన స్పందన పల్లి ఇంతకు ముందు పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లలో నటించారు. మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్న యుగ్ రామ్ గతంలో "కనబడుట లేదు" అనే సినిమాలో ప్రధాన పాత్రలో మెప్పించాడు. మరొక ముఖ్య పాత్ర పోషిస్తున్న వంశీ కోటు యూట్యూబ్ వేదికగా అందరికీ సుపరిచయం ఉన్న నటుడు. యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లు చేస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ చిత్రంలో వంశీ కోటు పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. చివరిగా ఈ చిత్ర దర్శకుడు ఇంతకుముందు పోలీస్ అధికారి అని ప్రచారం జరగడం కొస మెరుపు. ఒక వేళ అదే గనుక నిజం అయితే, నేర విచారణ లో జరిగే నిజమైన కోణాలను దర్శకుడు చాలా బాగా ఆవిష్కరిస్తారు.
ఈ సినిమాకు సాంకేతిక విభాగం.. కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: రామ్ గన్ని, నిర్మాత: స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ, సహ నిర్మాత: సుదర్శన్ రెడ్డి, బ్యానర్లు: ఎస్ ఎస్ ఫిల్మ్స్, కామన్ మాన్ ప్రొడక్షన్స్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సాయి కుమార్ దార, ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్, సంగీతం: శరవణ వాసుదేవన్, కో- డైరెక్టర్: శేఖర్ కుంపట్ల.