గుర్రం మృతి.. దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదు

FIR Against Mani Ratnam After Horse Dies.ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Sep 2021 7:21 AM GMT
గుర్రం మృతి.. దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదు

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌' . ఈ చిత్ర షూటింగ్‌లో ఓ గుర్రం చ‌నిపోయింది. దీనిపై పెటా ఇండియా తెలంగాణ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేష‌న్‌లో గుర్రం య‌జ‌మానితో పాటు ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. పిసిఎ చట్టం 1960, సెక్షన్ 11 మరియు భారతీయ శిక్షాస్మృతి 1860 సెక్షన్ 429 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

'పొన్నియిన్‌ సెల్వన్‌' షూటింగ్ గ‌త నెల‌లో అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలోని ఓ వ్యవసాయక్షేత్రంలో జరిగింది. ఓ యుద్ద సన్నివేశాన్ని తెర‌కెక్కించారు. ఈ యుద్ద స‌న్నివేశం కోసం ఏక‌ధాటిగా షూటింగ్ ను జ‌రిపారు. ఈ క్ర‌మంలో డీహెడ్రేష‌న్ తో ఓ గుర్రం మ‌ర‌ణించింది. ఈ విషయం తెలుసుకున్న పెటా ప్రతినిథులు పోలీసులను ఆశ్రయించారు.

దీనిపై గుర్రం యజమాని స్పందించారు. డీహైడ్రేట్ అయిన గుర్రాలను షూటింగ్ లో ఉప‌యోగించ‌డంతోనే గుర్రం ప్రాణాలు కోల్పోయింద‌న్నారు. మరోవైపు పెటా ప్రతినిధులు మాట్లాడుతూ.. షూటింగ్ కోసం జంతువులను ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌న్నారు. ప్ర‌స్తుతం టెక్నాల‌జీ ఎంతో అందుబాటులో ఉంది.. అలాంటి స‌న్నివేశాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడుకోవాల‌న్నారు.

రచయిత కల్కి కృష్ణమూర్తి వ్రాసిన తమిళ హిస్టారికల్ ఫిక్షనల్ నవల "పోన్నియన్ సెల్వన్" కథ ఆధారంగా ఈ చిత్రం భారీ స్థాయిలో తెర‌కెక్కుతోంది. ఐశ్వర్య రాయ్, విక్రమ్, జయం రవి, త్రిష, కార్తి వంటి స్టార్ కాస్టింగ్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాకాలు చేస్తున్నారు.

Next Story