'కింగ్డమ్' సినిమా.. జెర్సీ లాంటి సూపర్ హిట్ ను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ తీసిన చిత్రం ఇది. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించగా, భారీ యాక్షన్ డ్రామాగా రూపొందింది. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్సులు, విజువల్స్, టెక్నికల్ వాల్యూస్ పరంగా సినిమాకు మంచి పేరు వచ్చినా.. హిట్ అందుకోలేకపోయింది. ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ గురించిన చర్చ జరుగుతూ ఉంది. అయితే సినిమా నిర్మాత నాగవంశీ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.
కింగ్డమ్-2 సినిమా ఉండదని చెప్పారు. ఇప్పుడప్పుడే అలాంటి ఆలోచన లేదని, జరిగిపోయిన విషయాన్ని తవ్వి గౌతమ్ ను ఇబ్బంది పెట్టడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదన్నారు నాగవంశీ. కానీ గౌతమ్ తిన్ననూరితో మా బ్యానర్లోనే మరో సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఆయన చాలా బిజీగా ఉన్నారు. అవన్నీ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాక మా ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. కానీ 'కింగ్డమ్'కు సీక్వెల్ తీసే ఆలోచన మాత్రం లేదని అన్నారు.