బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైన చార్లీ

రక్షిత్ శెట్టి నటించిన సూపర్ హిట్ సినిమా '777 చార్లీ' థియేటర్లలోనూ, ఓటీటీలోనూ, కన్నడ టెలివిజన్లలోనూ ఊహించని రెస్పాన్స్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Jun 2023 2:15 PM IST
Charlie, Telugu screen, Tollywood, Kannda movie

బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైన చార్లీ 

రక్షిత్ శెట్టి నటించిన సూపర్ హిట్ సినిమా '777 చార్లీ' థియేటర్లలోనూ, ఓటీటీలోనూ, కన్నడ టెలివిజన్లలోనూ ఊహించని రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఇప్పటి వరకూ తెలుగులో బుల్లితెరపై సందడి చేయలేదు. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ టీవీలలో రానుందని జీతెలుగు తెలిపింది. ఈ చిత్రం జూన్ 11, 2023న సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. '777 చార్లీ' గతేడాది జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైంది. థియేటర్లలో, ఓటీటీలో మిస్సయిన వారు జూన్ 11న టెలివిజన్ లో చూడొచ్చు.

ధ‌ర్మ అనే వ్యక్తి జీవితంలోకి వచ్చిన చార్లీ అనే కుక్క అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింద‌నే క‌థాంశంతో '777 చార్లీ' తెరకెక్కింది. సినిమా ఖచ్చితంగా కంటతడి పెట్టిస్తుంది. ఇక కుక్కతో హీరో సంభాషణలు, సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. సినిమా థియటర్లలో ఈ సినిమాను చూసి ఎంతో మంది భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి కూడా సినిమాను చూసి కంటతడి పెట్టేసుకున్నారు. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. సినిమాలో కనిపించిన కుక్కకు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు ఇటీవల దక్కింది. చిత్తారా మీడియా ఇచ్చిన అవార్డులలో కుక్క అవార్డ్ గెలుచుకుంది. స్టేజ్ పైకి వచ్చి కుక్క ఈ అవార్డును తీసుకుంది.

Next Story