అజిత్ సినిమా అప్డేట్ గురించి ఇంగ్లాండ్ క్రికెటర్ ను అడిగిన అభిమానులు

Fans ask Moeen Ali for updates on Ajith's upcoming movie. తాజాగా చెన్నైలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో అభిమానులు అజిత్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను అడిగారు.

By Medi Samrat  Published on  14 Feb 2021 8:08 AM GMT
Fans ask Moeen Ali for updates on Ajith’s upcoming movie.

భారతదేశంలో ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి రెండే రెండు.. ఒకటి సినిమా.. ఇంకొకటి క్రికెట్..! క్రికెటర్లకు కూడా సినిమాల మీద మంచి కమాండ్ ఎలాగూ ఉంటుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా టిక్ టాక్ లు చేసేశాడు. మన బుట్టబొమ్మ పాట కూడా తనదే అనుకుని ప్రచారం చేసేశాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో భారత అభిమానులు స్టాండ్స్ లో నుండి బుట్టబొమ్మ గురించి వార్నర్ ను అడగ్గా.. ఏ మాత్రం బాధపడకుండా స్టెప్ వేశాడు. తాజాగా చెన్నైలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో అభిమానులు అజిత్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను అడిగారు.


అజిత్‌ తాజాగా 'వాలిమయి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ గురించి ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు అభిమానులు. రెండో టెస్టులోనూ అభిమానుల మధ్య ఈ సినిమాకు సంబంధించి చర్చ వచ్చింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ అలీతో మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్‌ అజిత్‌ సినిమా అప్‌డేట్‌ గురించి అడిగారు. బౌండరీ లైన్‌ వద్ద నిలబడి ఉన్న మొయిన్‌ అలీతో.. 'అలీ బాయ్‌.. వాలిమయి అప్‌డేట్‌ ఏంటి 'అని అడిగారు. అర్థంకాని మొయిన్‌ అలీ నవ్వుతూ వారికి చేతులూపాడు. పాపం అజిత్ సినిమా అప్డేట్ ను అలీ ఎలా చెప్తాడు కదా..!


Next Story
Share it