రామ్‌చరణ్‌పై అభిమానం.. 264 కి.మీ నడిచి మరీ..
Fan presents Ram Charan with rare gift after walking 264 km.సినీతారలను అభిమానించే వాళ్లు ఎంతో మంది ఉంటారు.
By తోట వంశీ కుమార్ Published on 29 May 2022 9:04 AM ISTసినీతారలను అభిమానించే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానాన్ని తెలియజేస్తుంటారు. కొందరు తమకు ఇష్టమైన నటీ, నటుల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకుంటుంటారు. మరికొందరు రక్తదానం, ఇంకొందరు పాదయాత్రలు వంటింటి చేస్తుంటారు. కాగా.. ఓ వ్యక్తి తన అభిమాన హీరో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ను కలుసుకునేందుకు ఏకంగా 264 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశాడు.
గద్వాల్‌కు చెందిన జైరాజ్ అనే యువకుడు తన అరెకరం వరి పొలంలో రామ్‌చరణ్ ముఖ చిత్రం ఆకారంలో వరి పంటను సాగు చేశాడు. కొంచెం ఎత్తు నుంచి వరి పంటలో రామ్‌చరణ్ ముఖ చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఫోటోలు తీసి ఫ్రేమ్ కట్టించుకున్నాడు. అందులో పండిన బియ్యాన్ని చరణ్‌కు ఇవ్వాలని అనుకున్నాడు. గద్వాల్ నుంచి హైదరాబాద్‌కు 264 కిలోమీటర్లు నడచుకుంటూ చరణ్ నివాసానికి చేరుకున్నాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న రామ్‌చరణ్.. అతడిని కలుసుకున్నాడు. జైరాజ్ అభిమానాన్ని చూసి చరణ్ మురిసిపోయారు. అతడి కృషిని అభినందించారు. జైరాజ్‌తో చాలా సేపు ముచ్చటించిన చరణ్.. అతడి కష్టసుఖాలను అడిగితెలుసుకున్నాడు. కాగా.. చరణ్‌ను కలుసుకున్న క్షణాలను ఎన్నటికి మరిచిపోలేనని, తాను ఇన్నాళ్లు పడిన కష్టాన్ని మరిచిపోయానని జైరాజ్ అంటున్నాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో చరణ్ సరసన కియరా అద్వానీ నటిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.