ప్రియమణిని న్యూడ్ ఫోటో కావాలని అడిగిన ఫాలోవర్.. సమాధానం ఏమని వచ్చిందంటే..!

Naked Photo Of Priyamani. తాజాగా ఓ నెటిజన్ ప్రియమణి ఫోటో కింద 'న్యూడ్ ఫోటోలు అప్లోడ్ చేయండి' అంటూ కామెంట్ పెట్టాడు.

By Medi Samrat
Published on : 31 March 2021 7:29 AM

Priyamani

ప్రియమణి.. నేషనల్ అవార్డు విన్నర్..! పలు సినిమాల్లో నటిస్తూ ఉండడమే కాకుండా.. టీవీ షోలలో కూడా కనిపిస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో తన ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటారు. సాధారణంగా కొందరు ఫాలోవర్స్ ప్రియమణి ఫోటోలకు సూపర్ అంటూ కామెంట్లు పెడుతూ ఉంటారు. అయితే ఇంకొందరు మాత్రం ఏది పడితే అది కామెంట్ల రూపంలో పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా ఓ నెటిజన్ ప్రియమణి ఫోటో కింద 'న్యూడ్ ఫోటోలు అప్లోడ్ చేయండి' అంటూ కామెంట్ పెట్టాడు.

ఈ కామెంట్ ను చూసిన ప్రియమణి.. సదరు వ్యక్తిని 'ఇదే విషయం మీ సోదరిని కానీ.. తల్లిని కానీ అడుగు.. వారు న్యూడ్ ఫోటోలు పోస్టు చేస్తే ఆ తర్వాత తాను కూడా అదే పని చేస్తాను' అని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు ప్రియమణి. దీంతో సదరు వ్యక్తి సారీ మేడమ్ అంటూ క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇక అదే ఫొటోకు మ‌రో నెటిజ‌న్ న‌న్ను పెళ్లి చేసుకుంటావా అని అడగ్గా.. మా భ‌ర్త ద‌గ్గ‌ర ప‌ర్మిష‌న్ తెచ్చుకో. ఆయ‌న ఓకే అంటే నిన్నే పెళ్లి చేసుకుంటా అని ప్రియ‌మ‌ణి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తోన్న ప్రియ‌మ‌ణి, అటు బుల్లితెర‌పై కూడా డ్యాన్స్ షోల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విరాటపర్వం సినిమాలో కీలక పాత్రలో ప్రియమణి నటిస్తూ ఉన్నారు. ఇక 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ కోసం కూడా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.




Next Story