నటుడు మోహన్‌ బాబు ఇంట్లో దొంగతనం

ప్రముఖ నటుడు సినీ నటుడు మోహన్‌ బాబు ఇంట్లో చోరీ జరిగింది. జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసంలో రూ.10 లక్షలు దోచుకొని నాయక్‌ అనే పని మనిషి పారిపోయాడు.

By అంజి
Published on : 25 Sept 2024 10:52 AM IST

actor Mohan Babu, theft, Hyderabad, Jalpalli

నటుడు మోహన్‌ బాబు ఇంట్లో దొంగతనం

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు సినీ నటుడు మోహన్‌ బాబు ఇంట్లో చోరీ జరిగింది. జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసంలో రూ.10 లక్షలు దోచుకొని నాయక్‌ అనే పని మనిషి పారిపోయాడు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. మంగళవారం నాడు రాత్రి రాచకొండ పోలీస్‌ కమిషనర్‌కి మోహన్‌ బాబు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు.. నాయక్‌ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అతడిని తిరుపతిలో అదులోకి తీసుకున్నట్లు తెలిసింది.

కాగా గతంలోనూ ఆయన ఇంట్లో చోరీ జరిగింది. 2019లో డబ్బులు, బంగారు ఆభరణాలు పని మనిషి దొంగిలించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2022లో మోహన్‌ బాబు కుమారుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగింది. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో ఉన్న మా ఆఫీస్‌లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆయన వినియోగించే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని దొంగిలించారు.

Next Story