'ఫ్యామిలీ స్టార్' నిడివి తగ్గించేశారా..?

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది.

By Medi Samrat  Published on  4 April 2024 11:00 AM GMT
ఫ్యామిలీ స్టార్ నిడివి తగ్గించేశారా..?

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. మొదట ఈ సినిమా రన్ టైమ్ 163 నిమిషాలని సెన్సార్ రిపోర్ట్ ద్వారా బయటకు వచ్చింది. అయితే సినిమా రన్ టైమ్ 150 నిమిషాలని ఫిక్స్ చేస్తూ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఫ్యామిలీ స్టార్ రన్ టైమ్ తెలుగు వెర్షన్ కోసం మాత్రమే ట్రిమ్ చేశారా అని అనుమానిస్తున్నారు.

సెన్సార్ రిపోర్ట్ లో చాలా బూతులు ఉన్నాయని తేలింది. అయితే.. ఆ డైలాగ్స్ అన్నింటినీ సెన్సార్ బోర్డు మ్యూట్ చేసింది. రన్ టైమ్ కూడా 163 నిమిషాలకు అంటే 2 గంటల 43 నిమిషాలకు లాక్ చేశారు. కానీ ఇప్పుడు, అధికారిక పోస్టర్‌లో సినిమా కేవలం 150 నిమిషాలు అంటే 2 గంటల 30 నిమిషాలు మాత్రమే ఉందని చెప్పారు. సినిమా మీద నెగటివ్ టాక్ రాకుండా.. టీమ్ 13 నిమిషాల భాగాన్ని ట్రిమ్ చేసి ఉండవచ్చు. పరశురామ్-విజయ్‌ల కాంబో మంచి బజ్‌ని సృష్టిస్తోంది.

Next Story