'విరూపాక్ష' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ సినిమా థ్రిల్లర్ అని చెబుతూ

By అంజి  Published on  10 April 2023 7:45 PM IST
Virupaksha movie, Sai Dharam Tej, Tollywood, Samyuktha Menon

'విరూపాక్ష' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ సినిమా థ్రిల్లర్ అని చెబుతూ ఉన్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుకను ఏలూరు లో నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు మూవీ టీమ్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకను ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఏప్రిల్ 16న సాయంత్రం 5 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ఈవెంట్‌కు అతిథులు ఎవరా అనే విషయమై సస్పెన్స్ మాత్రం నెలకొంది.

విరూపాక్షలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్‌గానటించింది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమాకు సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహ నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. టీజర్, ట్రైలర్ లు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. కాంతార ఫేమ్ అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

Next Story