'ఎత్తర జెండా' పాట విషయంలో ఊహించని ట్విస్ట్

Etthara Jenda Video Song Released. ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో సినిమా పాటలు, టీజర్ల విషయంలో లీకుల షాకులు తగులుతూ ఉన్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  14 March 2022 7:46 PM IST
ఎత్తర జెండా పాట విషయంలో ఊహించని ట్విస్ట్

ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో సినిమా పాటలు, టీజర్ల విషయంలో లీకుల షాకులు తగులుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఎన్నో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించినవి లీక్ అవ్వడంతో అభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్లు షాక్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి 'ఎత్తర జెండా' సాంగ్ ను తీసుకుని రావాల్సి ఉంది. ఈ పాటను మొదట నేడు విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా ఎత్తర జెండా పాటను ఇవాళ విడుదల చేయలేకపోతున్నామని ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ వెల్లడించింది. ఈ పాటను రేపు (మార్చి 15) ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తామని ట్విట్టర్ లో పేర్కొంది. అయితే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఈ పాటను అధికారికంగా విడుదల చేసేశారు.

ఈ పాట విషయంలో ఈ ఊహించని షాక్ అభిమానులకు ఎదురైంది. దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య ఇవాళ ఏపీ సీఎం జగన్ ను ఆయన నివాసంలో కలిశారు. ఈ భేటీలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు. మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధ‌ర‌లు, బెనిఫిట్ షో త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.












Next Story