హీరో మహేష్‌బాబుకు ఈడీ నోటీసులు

హీరో మహేష్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది.

By అంజి
Published on : 22 April 2025 9:04 AM IST

Enforcement Directorate, Mahesh Babu, Sai Surya Developers , Surana Group Company

హీరో మహేష్‌బాబుకు ఈడీ నోటీసులు

హీరో మహేష్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్‌కు చెందిన సాయి సూర్య డెవలపర్స్‌తో పాటు సురానా గ్రూపు కంపెనీ వ్యవహారంలో ఈడీ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ కోసం మహేష్ బాబు ప్రమోషన్ నిర్వహించారు. ఇందు కొరకు 5.9 కోట్ల రూపాయల డబ్బుని మహేష్ బాబు తీసుకున్నారు. ఇందులో కొంత నగదు రూపంలో తీసుకోగా మరికొంత ఆర్టిజిఎస్ రూపంలో ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే ఈ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు సాయి సూర్య డెవలపర్స్ సురానా కంపెనీలో ఈ డి సోదాలు నిర్వహించినప్పుడు బయటపడింది.

సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా మహేష్ బాబుకి ఈడి నోటీసులు ఇచ్చింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా కంపెనీలు పెద్ద మొత్తంలో వెంచర్ల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు గతంలోని సాయి సూర్య డెవలపర్స్ చైర్మన్ సతీష్ గుప్తను అరెస్టు చేశారు. సూరానా గ్రూపు పైన కూడా కేసు నమోదు చేశారు.. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది.. ఈ నేపథ్యంలోనే ఈనెల 16వ తేదీన ఈడీ రెండు రోజులపాటు సాయి సూర్య డెవలపర్స్ , సూరన గ్రూపులో సోదాలు నిర్వహించింది.

Next Story