'ఓజీ' నుంచి ఇమ్రాన్‌ హష్మీ పిక్‌ రిలీజ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్‌ సినిమా 'ఓజీ'. ఈ సినిమాకు టాలీవుడ్‌ స్టైలిష్‌ డైరెక్టర్‌ సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

By అంజి  Published on  24 March 2024 6:34 AM GMT
emraan hashmi, pawan kalyans, og movie, Tollywood

'ఓజీ' నుంచి ఇమ్రాన్‌ హష్మీ పిక్‌ రిలీజ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్‌ సినిమా 'ఓజీ'. ఈ సినిమాకు టాలీవుడ్‌ స్టైలిష్‌ డైరెక్టర్‌ సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన సినిమా గ్లింప్స్‌ రికార్డ్‌ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. తాజాగా సినిమాలో విలన్‌ పాత్ర పోషిస్తున్న ఇమ్రాన్‌ హష్మీ ఫొటోను యూనిట్‌ షేర్‌ చేసింది. యుద్ధాన్ని ఊహించలేరు అంటూ మాస్‌ క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో సినిమాపై హోప్స్‌ పెరుగుతున్నాయి.

ఫొటోలో ఇమ్రాన్ చాలా సీరియస్ గా సిగరెట్ వెలిగిస్తూ ఉన్నాడు. పోస్టర్ పై హ్యాపీ బర్త్ డే టు ఓమి భాయ్ అని రాసుంది. దీంతో ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ఓమి భాయ్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'సలార్'తో సెన్సేషనల్ అయిన శ్రియా రెడ్డీ కీలక పాత్ర పోషిస్తోంది. అర్జున్ దాస్, తేజ్ సప్రూ.. ఇలా చాలా మంది స్టార్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ఈ మధ్యే ప్రకటించారు.

Next Story