ఏమి సేతురా లింగ.. సినిమా రివ్యూ
ఏమి సేతురా లింగ’ సినిమాను దర్శకుడు కె.సందీప్ తెరకెక్కించారు. వినోద్ వర్మ, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, కేశవ్ దీపక్,ఆనంద చక్రపాణి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 May 2023 12:45 PM GMTఏమి సేతురా లింగ.. సినిమా రివ్యూ
మనం చాలా మంది జీవితంలో ఒకటి అవుదామనుకుని ఏమీ అవ్వకుండా మిగిలిపోతున్నామనే బాధ మానను వెంటాడుతూ ఉంటుంది. చేతిలో ఉద్యోగం ఉంది.. కంఫర్టబుల్ గా లైఫ్ నడుస్తూ ఉందంటే అక్కడే నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి చేసేయాలి.. రిస్క్ తీసుకున్నా పర్వాలేదని అనుకుంటేనే లైఫ్ లో ఏదైనా సాధించగలం. ఇలాంటి కాన్సెప్ట్ లు మనల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేస్తాయి. అలాంటి సినిమాలు తెలుగులో రావడం కూడా చాలా అరుదు. తాజాగా ఈ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే 'ఏమి సేతురా లింగ'. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న సినిమా మంచి రెస్పాన్స్ ను అందుకుంటూ ఉంది.
ఏమి సేతురా లింగ’ సినిమాను దర్శకుడు కె.సందీప్ తెరకెక్కించారు. వినోద్ వర్మ, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, కేశవ్ దీపక్,ఆనంద చక్రపాణి , మేకా రామకృష్ణ, పవన్ రమేష్ తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో తెలుసుకుందాం.
కథ:
భాను(వినోద్ వర్మ) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. రొటీన్ లైఫ్.. ఉద్యోగం.. జీతం.. జీవితం.. ఇదేనా లైఫ్ అని అతడికి అనిపిస్తూ ఉంటుంది. ఇక పర్సనల్ లైఫ్ విషయంలో లవ్ లో కూడా కష్టాలే..! ఇష్టం లేకపోయినా ఉద్యోగం చేస్తూనే ఉంటాడు. అమ్మాయిలు కూడా అతడికి హ్యాండ్ ఇస్తూనే ఉంటారు. ప్రేమించానని చెప్పిన ఓ అమ్మాయి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ప్రేమ మీద నమ్మకం కోల్పోయిన భాను లైఫ్ లోకి స్వేచ్ఛ(జ్ఞానేశ్వరి కాండ్రేగుల) వస్తుంది. ఈమె చాలా ప్రాక్టికల్ అమ్మాయి. ఆమె భానును మార్చిందా.. తన ఉద్యోగాన్ని వదిలేసి అతడు తాను అనుకున్న గోల్ ను రీచ్ అయ్యాడా అని తెలిపేదే మిగిలిన కథ.
ఎవరెవరు ఎలా చేశారు:
ముఖ్యంగా హీరో భాను పాత్రలో వినోద్ వర్మ చాలా సహజంగా నటించాడు. ఈ కాలంలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న వాళ్లు పడుతున్న కష్టాలు.. ఆ లైఫ్ ఎలా ఉంటుందో చూపించారు. స్వేచ్ఛ పాత్ర కూడా బాగుంది. హీరోకి మేనేజర్ పాత్రలో చేసిన కేశవ్ దీపక్ నవ్వులు పూయించారు. ముఖ్యంగా క్యాస్ట్ పిచ్చితో అతడు చేసే అరాచకాలు అంతా ఇంతా కాదు. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు.
మిగిలిన అంశాలు:
సినిమాకు జెన్ మార్టిన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ ప్లస్ గా మారింది. రియాలిటీకి దగ్గరగా ఉన్న కథ కావడంతో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కు ఈజీగా కనెక్ట్ అవుతుంది. తక్కువ బడ్జెట్ లో మంచి సినిమా తీశారు. సాగతీతకు అవకాశం లేకుండా చూసుకున్నారు. ప్రీ క్లైమాక్స్ బాగుంది. కొన్ని డైలాగ్స్ కు మనం బాగా కనెక్ట్ అవుతాం.
ప్లస్ పాయింట్స్:
కథ
సినిమాటోగ్రఫీ
డైలాగ్స్
రేటింగ్ : 3/5