కామెడీ యాక్షన్‌లో "డబుల్‌ డోస్‌" తో వస్తున్న మంచు విష్ణు

Double Dose.. Manchu Vishnu .. ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల, హీరో మంచు విష్ణు కాంబినేషన్‌లో వచ్చిన ఢీ చిత్రం ఎంత సూపర్ హ

By సుభాష్  Published on  23 Nov 2020 2:11 PM IST
కామెడీ యాక్షన్‌లో డబుల్‌ డోస్‌ తో వస్తున్న మంచు విష్ణు

ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల, హీరో మంచు విష్ణు కాంబినేషన్‌లో వచ్చిన ఢీ చిత్రం ఎంత సూపర్ హిట్‌గా నిలిచిందో అంద‌రికి తెలిసిందే. ఆ చిత్రంతో మంచు విష్ణు హీరోగా మంచి పేరు సంపాదించాడు. ఈ చిత్రం వ‌చ్చి 13 సంవ‌త్స‌రాలైంది. కాగా.. ఇప్ప‌టికే ఎన్నో సార్లు ఈ చిత్రాన్నికి స్వీకెల్ తెర‌కెక్కుతోందనే వార్త‌లు వినిపించాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అవి నిజం కాలేదు. తాజాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఈ చిత్ర సీక్వల్ తెర‌కెక్కుతోంది. ఈ మంచు విష్ణు పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా డి & డి (D & D) మూవీని ప్రకటించారు. దీనికి డబుల్ డోస్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ సందర్భంగా విష్ణు ట్వీట్‌ చేశాడు. పెద్ద అన్నయ్య శ్రీను వైట్లతో మరోసారి సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉందని తెలిపాడు.

డబుల్ డోస్ ఉపశీర్షికతో ఢీ ఫ్రాంచైజీలోని మొదటి చిత్రం కంటే డబుల్ డోస్ యాక్షన్ కామెడీ ఉంటుందని అర్థమవుతోంది. ఆసక్తికరంగా టైటిల్ రెండక్షరాలు భేడీలతో ముడిపడి కనిపించడం చూస్తుంటే ఇది ఖైదీల నడుమ కామెడీనా? అన్న సందేహం కలగక మానదు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఢీ సహా అనేక బ్లాక్ బస్టర్లలో భాగమైన శ్రీను వైట్ల అభిమాన రచయిత గోపి మోహన్ మరోసారి వైట్లతో కలిసి ఈ మూవీ కోసం పని చేస్తున్నారు. ప్రముఖ రచయిత కిషోర్ గోపుతో కలిసి గోపీమోహన్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. యువ సంచలనం మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నారు. మోహనా కృష్ణ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

కాగా.. మంచు విష్ణు హీరోగా మోసగాళ్లు అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రుహీ సింగ్, నవదీప్, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story