'బ్రో' కోసం త్రివిక్రమ్ అంత పారితోషికం తీసుకున్నాడా?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో త్రివిక్రమ్ ఒకరు. ఈయన సినిమాలకే కాదు.. ఈయన మాటలకు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.
By అంజి Published on 13 July 2023 8:52 AM IST
'బ్రో' కోసం త్రివిక్రమ్ అంత పారితోషికం తీసుకున్నాడా?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో త్రివిక్రమ్ ఒకరు. ఈయన సినిమాలకే కాదు.. ఈయన మాటలకు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ నుంచి సినిమా వస్తుందంటే సినీ లవర్స్‌లో ఏదో తెలియని ఇంట్రెస్ట్ ఉంటుంది. దర్శకుడు కాకముందు ఎన్నో చిత్రాలకు రైటర్ గా పనిచేశారు. ఆయన పెన్ను పవర్ ఎంటో అందరికీ తెలిసిందే. ఆయన తెరకెక్కించిన 'ఖలేజా', 'అజ్ఞాతవాసి' సినిమాలు తప్ప మిగతా సినిమాలన్నీ టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసినవే. త్రివిక్రమ్ ఓ పక్క సినిమాలకు దర్శకత్వం, మరోపక్క ఇతర దర్శకుల సినిమాలకు స్క్రీన్ ప్లే అందిస్తూ ఉంటారు. తాజాగా ఈ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఇప్పుడు ఆకాశంలో ఉందని టాక్ వినిపిస్తోంది. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ చేస్తోన్న 'బ్రో' సినిమాకు కూడా త్రివిక్రమే స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
ఈ సినిమా కోలీవుడ్ చిత్రం 'వినోదయ సిత్తం'కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియాప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. జూలై 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పుడు 'బ్రో' సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నందుకు త్రివిక్రమ్ తీసుకున్న రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాలీవుడ్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ కోసం మాటల మాంత్రికుడు రూ. 15 కోట్ల పారితోషికం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే పెద్ద హీరోలకు సరిసమానంగా త్రివిక్రమ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారన్న మాట. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేశ్ బాబుతో 'గుంటూరు కారం' అనే సినిమా చేస్తున్నారు.