భీమ్లా నాయ‌క్‌పై వ‌ర్మ ట్వీట్లు.. ప‌వ‌న్ ఓ సునామి.. హిందీలో కూడా

Director Ram Gopal Varma tweet on Bheemla Nayak.ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన చిత్రం 'భీమ్లానాయ‌క్‌'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2022 10:39 AM GMT
భీమ్లా నాయ‌క్‌పై వ‌ర్మ ట్వీట్లు.. ప‌వ‌న్ ఓ సునామి.. హిందీలో కూడా

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన చిత్రం 'భీమ్లానాయ‌క్‌'. ఈ చిత్రం నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం భీమ్లానాయ‌క్ సంద‌డి నెల‌కొంది. సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా కూడా ప‌వ‌న్ మేనియానే క‌నిపిస్తోంది. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వ‌స్తోంది. దీంతో ప‌వ‌న్ అభిమానులు చాలా ఖుషీ అవుతున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లో మ‌రో బ్లాక్‌బాస్ట‌ర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అటు సినీ ప్ర‌ముఖులు సైతం భీమ్లానాయ‌క్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిస్తున్నారు.

ఇక నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ సైతం భీమ్లా నాయ‌క్‌పై ట్వీట్ చేశాడు. గ‌తంలో ప‌వ‌ర్‌స్టార్‌పై ఓ రేంజ్‌లో సెటైరిక‌ల్ కామెంట్స్ చేసిన వ‌ర్మ ఈ సారి మాత్రం పాజిటివ్ కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలిచాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌న‌ను మెచ్చుకోవ‌డంతో పాటు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

'భీమ్లానాయ‌క్ ఓ పెను తుపాను, ప‌వ‌న్ ఓ సునామి. రానా కూడా ప‌వ‌న్‌తో పోటాపోటీగా న‌టించాడు. మొత్తానికి భీమ్లా నాయ‌క్ ఓ భూకంపం ' అంటూ ట్వీట్ చేశాడు.

మ‌రో ట్వీట్‌లో తాను ముందు నుంచి చెబుతున్న‌ట్లుగానే భీమ్లానాయ‌క్ చిత్రాన్ని హిందీలోనూ విడుద‌ల చేయాల్సింది. ఈ సినిమా హిందీలో ఖ‌చ్చితంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసి ఉండేదని వ‌ర్మ చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం వ‌ర్మ చేసిన ట్వీట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించ‌గా.. సాగర్‌.కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ న‌టించారు.

Next Story
Share it