చాలా రోజుల త‌రువాత గర్జించే పవన్‌ని చూశా

Director Hairsh Shankar review on Bheemla Nayak.ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన చిత్రం భీమ్లానాయ‌క్‌. ఈ చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2022 10:41 AM IST
చాలా రోజుల త‌రువాత గర్జించే పవన్‌ని చూశా

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన చిత్రం 'భీమ్లానాయ‌క్‌'. ఈ చిత్రం నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం భీమ్లానాయ‌క్ సంద‌డి నెల‌కొంది. సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా కూడా ప‌వ‌న్ మేనియానే క‌నిపిస్తోంది. ఇక ఇప్ప‌టికే చాలా చోట్ల తొలి ఆట పూర్తి అయిపోయింది. బెనిఫిట్ షో చూసిన వారంద‌రూ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు. ఇందులో టాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా ఉన్నారు. ఇక ప‌వ‌న్‌తో 'గ‌బ్బ‌ర్ సింగ్' తీసిన ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ 'భీమ్లా నాయ‌క్' చిత్ర రివ్యూ ఇచ్చేశాడు.

భీమ్లా నాయ‌క్ చిత్రాన్ని చూశాను. చాలా రోజుల త‌రువాత థియేట‌ర్ల‌లో ప‌వ‌న్ గ‌ర్జ‌న చూస్తుంటే మాటల్లో చెప్ప‌లేనంత ఆనందంగా ఉంది. థ‌మ‌న్ అందించిన మ్యూజిక్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. 'బావా.. నీ కెరీర్‌లోనే ఇది బెస్ట్ వ‌ర్క్‌. ప్ర‌తి స‌న్నివేశాన్ని నీవు అర్థం చేసుకున్న విధానం.. అందుకు అనుగుణం మ్యూజిక్ ఇచ్చిన తీరు బాగుంది. ఇది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాదు.. బ్యాక్‌బోన్ ఆఫ్ భీమ్లా. నిన్ను చూస్తుంటే గ‌ర్వంగా ఉంది బావా.. ఇక రానా.. నీలో నేను కేవ‌లం డేనియ‌ల్ శేఖ‌ఱ్ని మాత్ర‌మే చూశా. నువ్వు అద‌ర‌గొట్టేశావు.' అంటూ హ‌రీశ్ శంక‌ర్ ట్వీట్ చేశాడు.


Next Story