మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తలను మోహన్ బాబు పీఆర్ టీమ్ ఖండించింది. మనోజ్ గాయాలతో వెళ్లి పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆస్తి వ్యవహారంలో మోహన్ బాబు, మనోజ్ గొడవపడ్డారని, పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై మోహన్ బాబు పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయని, తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని వార్తలు వచ్చాయి. స్కూల్, ఆస్తుల వ్యవహారంలో గొడవ జరిగినట్టు పుకార్లు వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు పీఆర్ టీమ్ తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలు ప్రసారం చేయొద్దంటూ మీడియాకు హితవు పలికింది.