'కల్కి 2989ఏడీ' సినిమా చూశాకా.. మీకూ ఈ డౌట్‌ వచ్చిందా?

కల్కి 2989ఏడీ సినిమా క్లైమాక్స్‌లో సుప్రీం యస్కిన్‌ (కమల్‌ హాసన్‌) గాండీవాన్ని ఎత్తుతారు. గాండీవాన్ని ఎత్తే శక్తి కేవలం అర్జునిడికే ఉంటుంది.

By అంజి  Published on  6 Aug 2024 6:00 AM
Kalki 2989AD, Tollywood, Prabhas, Kamalhasan

'కల్కి 2989ఏడీ' సినిమా చూశాకా.. మీకూ ఈ డౌట్‌ వచ్చిందా?

కల్కి 2989ఏడీ సినిమా క్లైమాక్స్‌లో సుప్రీం యస్కిన్‌ (కమల్‌ హాసన్‌) గాండీవాన్ని ఎత్తుతారు. గాండీవాన్ని ఎత్తే శక్తి కేవలం అర్జునిడికే ఉంటుంది. కాబట్టి కమల్‌ హాసనే అర్జునుడు అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే గాండీవం కేవలం భౌతిక ఆయుధం మాత్రమే కాదు. మహా భారతం ప్రకారం.. దానికి అపారమైన శక్తి ఉంటుంది. ఆ విల్లు అర్జునిడి బలానికి, ధర్మానికి చిహ్నంగా ఉంటుంది. దీని ప్రకారం కమల్‌హాసనే అర్జునుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పైగా ఈ మూవీలో ప్రభాస్‌ కర్ణుడి పాత్రలో హీరోగా నటించారు. కమల్‌ హాసన్ విలన్‌గా నటించారు.

హీరో విలన్‌ అంటే పరోక్షంగా వీరి మధ్య శత్రుత్వం ఉన్నట్టే. మహా భారతంలో అర్జునుడు, కర్ణుడు శత్రువులు అయినట్టే.. కల్కి రెండో భాగంలో కర్ణుడి (ప్రభాస్‌)కి శత్రువులా అర్జునుడే (కమల్‌హాసన్‌) ఉంటాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారతంలో కర్ణుడు అధర్మం వైపు నిలబడుతాడు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఈ సారి ధర్మం వైపు ఉంటాడా? అనే సందేహాలు కూడా ఈ అనుమానానికి బలాన్ని ఇస్తున్నాయి. అయితే సుమతి (దీపిక) కడుపులో ఉన్న కల్కి దేవుడి నుంచి వచ్చిన సీరం తాగడం వల్లే సుప్రీం యస్కిన్‌ గాండీవాన్ని ఎత్తగలిగాడని మరికొందరు అంటున్నారు.

Next Story