రెండో పెళ్ళికి సిద్ధమైన దియా మీర్జా..!

Dia Mirza to tie the knot with Mumbai-based businessman. బాలీవుడ్‌ బ్యూటీ దియా మిర్జా రెండో సారి పరిణయమాడేందుకు సిద్ధమైంది.

By Medi Samrat  Published on  13 Feb 2021 12:44 PM GMT
Dia Mirza to tie the knot with Mumbai-based businessman

నటీ నటులు అన్నాక డేటింగ్లు, పెళ్లయ్యాక విడిపోవడాలు మళ్ళీ పెళ్లిళ్లు చేసుకోవడాలు సహజం. ఇక బాలీవుడ్ లో అయితే ప్రత్యేకంగా చెప్పే పని లేదు. చాలా మంది అలా చేసిన వాళ్ళు వున్నారు. ఇక తాజాగా కోవలోకి బాలీవుడ్ హాట్ బ్యూటీ దియా మీర్జా కూడా చేరింది..బాలీవుడ్‌ బ్యూటీ దియా మిర్జా రెండో సారి పరిణయమాడేందుకు సిద్ధమైంది. దియా 2004 సంవత్సరంలో నిర్మాత సాహిల్‌ సంఘాను పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరు పలు కారణాల వలన విడిపోయారు.

అయితే విడాకుల అనంతరం వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీతో దియా ప్రేమాయణం నడుపుతున్నట్టు అనేక ప్రచారాలు నడిచాయి. దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరి 15న ముంబైకి చెందిన వ్యాపావేత్త వైభవ్‌ రేఖీతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. ఇరువురి కుటుంబాలు వీరికి పెళ్ళికి అంగీకారం తెలపడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. కాగా దియా ప్రస్తుతం తెలుగులో 'వైల్డ్‌ డాగ్' మూవీలో నటిస్తున్నారు.

ఇదిలావుంటే.. దియా మిర్జా హైదరాబాదులో జన్మించారు. ఆమె తండ్రి ఫ్రాంక్ హండ్రిచ్. ఆయన జర్మన్‌ గ్రాఫిక్, ఇండస్ట్రియల్ ఫైర్ ఆర్కిటెక్ట్ కళాకారుడు, ఇంటీరియర్ డిజైనర్. ఆమె తల్లి దీపా బెంగాలీ. సామాజిక కార్యకర్త. దియా మిర్జా ఆరు సంవత్సరాల ప్రాయంలో ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. తొమ్మిది సంవత్సరాలప్పుడు ఆమె తండ్రి మరణించాడు. ఆమె ఖైరతాబాదులోని విద్యారణ్య హైస్కూల్ లో చదివారు. ఆ తర్వాత‌ స్టాన్లీ జూనియర్ కాలేజీలో చేరి ఓపెన్‌ డిగ్రీని పొందారు. దియా మిర్జా 2000 లో జరిగిన ఫెమినా మిస్ ఇండియాలో రెండవ రన్నరప్ గా నిలిచింది. ఆ త‌ర్వాత మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ ను కూడా గెలుచుకుంది.Next Story