'ధురందర్-2' నటుడికి పాకిస్థాన్ నుండి 'ఐ లవ్ యూ' మెసేజ్‌లు..!

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురందర్ 2' ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

By -  Medi Samrat
Published on : 27 March 2026 12:14 PM IST

ధురందర్-2 నటుడికి పాకిస్థాన్ నుండి ఐ లవ్ యూ మెసేజ్‌లు..!

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురందర్ 2' ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని నటీనటులంద‌రికీ మంచి గుర్తింపు వ‌చ్చింది. వారిలో ఒకరు నటుడు వివేక్ సిన్హా.. ఈ చిత్రంలో జహూర్ మిస్త్రీ పాత్రను పోషించారు. ఒక ఇంటర్వ్యూలో వివేక్ తనకు భారతదేశం నుండి చాలా ప్రేమ లభించిందని, అలాగే పొరుగు దేశమైన పాకిస్తాన్ నుండి కూడా అనేక సందేశాలు వస్తున్నాయని వెల్లడించారు.

తన నటన, సంభాషణల కారణంగా చాలా మంది తనకు ద్వేషపూరిత సందేశాలు పంపుతుండగా, మరికొందరు తనపై ప్రేమను కురిపిస్తున్నారని వివేక్ వెల్లడించారు. జీ న్యూస్‌తో మాట్లాడుతూ వివేక్ ఇలా అన్నారు.. "నా ఇన్‌స్టాగ్రామ్‌లో 2,000 కామెంట్లు ఉన్నాయి. నేను వాటిని ఆస్వాదిస్తున్నాను. నన్ను తెరపై చూసిన‌ చాలా మందికి ఎంత కోపం వస్తుందంటే.. వీలైతే తెరపైకి దూకి నన్ను చెంపదెబ్బ కొడతామని అంటున్నారు. నా నటన చాలా సహజంగా, బాగుందని భావించి నన్ను ప్రశంసించిన వారు కూడా కొందరు ఉన్నారు. కామెంట్ పంపినవారిలో కొందరు ఎంతగానో ఉద్రేకపడి.. పాకిస్తాన్‌లో త‌న‌ను చంపేస్తామని బెదిరించారని.. నేను పాకిస్తానీయుడిని కాదని, బిజ్నోర్‌కు చెందిన భారతీయుడినని పేర్కొన్నాడు.

అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పాకిస్తాన్‌కు చెందిన కొందరు వివేక్‌కు 'ఐ లవ్ యు' అని సందేశాలు పంపారు. తనకు 'సర్, ఐ లవ్ యు, నేను పాకిస్తాన్ నుండి' అని ఒక సందేశం వచ్చిందని చెప్పారు. దానికి వివేక్‌ నవ్వి, 'ఆగండి, మనం తర్వాత మాట్లాడుకుందాం' అని బదులిచ్చారు.

తన జీవితం గురించి మాట్లాడుతూ.. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయారని వివేక్ వెల్లడించాడు. త‌న‌ తల్లి ఒంటరిగా అతన్ని పెంచి, ఏ లోటూ లేకుండా చూసుకుందని పేర్కొన్నాడు.

Next Story