ఆకట్టుకుంటున్న ధనుష్‌ 'తిరు' మూవీ ట్రైలర్‌

Dhanush's Thiru movie trailer released. తమిళ్‌ హీరో నటించిన లేటెస్ట్‌ మూవీ 'తిరు'. ఈ సినిమాకు మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వం వహించారు. ఆగస్టు 18న విడుదల కానుంది.

By అంజి  Published on  13 Aug 2022 5:42 PM IST
ఆకట్టుకుంటున్న ధనుష్‌ తిరు మూవీ ట్రైలర్‌

తమిళ్‌ హీరో నటించిన లేటెస్ట్‌ మూవీ 'తిరు'. ఈ సినిమాకు మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వం వహించారు. ఆగస్టు 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్‌.. ఈ మూవీకి సంబంధించి వరుస అప్‌డేట్‌లు ఇస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్‌ ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. '''రేయ్ పండు నీ ఆర్డ‌ర్ రెడీ అయ్యింది. ఎంత‌సేప‌టి నుండి పిల‌వాలి. వ‌చ్చి తీసుకెళ్ళు'' అంటూ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. 'నా లైఫ్ చాలా సింపుల్ లైఫ్‌. 9 టు 6 వీక్ డేస్ ఫుల్‌గా వ‌ర్క్‌. వీకెండ్ అంటే ఏదో సినిమా, టీవీ, నెట్‌ఫ్లిక్స్ చూసుకునే ఒక మాములు లైఫ్'. అంటూ హీరో ధనుష్‌ పలికే డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి.

ట్రైలర్‌ మొత్తం చాలా ఫన్‌ రైడ్‌లాగా ఉంది. దనుష్‌ తండ్రి పాత్రలో ప్రకాష్‌రాజ్‌ కనిపించనున్నాడు. 'వ‌చ్చాడు ఘ‌ర్ష‌ణ వెంక‌టేష్ ఈయ‌నొక్క‌డే ఈ లోకాన్ని కాపాడ‌తాడు' అంటూ ప్ర‌కాష్‌రాజ్‌పై వేసే సెటైరికల్‌ పంచులు ఆకట్టుకుంటున్నాయి. ధ‌నుష్, నిత్యామీన‌న్ సీన్లు చూస్తుంటే అలరిస్తున్నాయి. ట్రైల‌ర్‌ చివ‌ర్లో ఇప్పుడు 'ఈయ‌న ఏం చేస్తాడు. బాధ‌తో ఇళ‌యరాజా పాట‌లు వింటుంటాడు' అంటూ నిత్యామీన‌న్ డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించారు. స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మించాడు. ధ‌నుష్‌ సరసన రాశీఖ‌న్నా, ప్రియా భ‌వాని శంక‌ర్ న‌టించారు. ఈ మూవీకి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించాడు.


Next Story