'నేనే వస్తున్నా' పోస్టర్‌ రిలీజ్‌.. క్లాస్‌లుక్‌లో ధ‌నుష్‌

Dhanush 'Nane Varuven' movie Telugu poster release. తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌

By అంజి  Published on  14 Sept 2022 11:44 AM IST
నేనే వస్తున్నా పోస్టర్‌ రిలీజ్‌..  క్లాస్‌లుక్‌లో ధ‌నుష్‌

తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వా రాఘవన్‌ డైరెక్షన్‌ చేశాడు. ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్‌ చేశాయి. ఈ సినిమా సెప్టెంబర్‌ 29న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ మేకర్స్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచేందుకు వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్‌ తెలుగు పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

ఈ సినిమాకు తెలుగులో 'నేనే వ‌స్తున్నా' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ పోస్ట‌ర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు. 'నేనే వ‌స్తున్నా' మూవీలో ధ‌నుష్ రెండు పాత్రల్లో న‌టించాడు. హీరోగా, విల‌న్‌గా రెండు పాత్ర‌లను ధ‌నుష్ ఈ చిత్రంలో పోషించాడు. ఈ చిత్రాన్ని వి క్రియేష‌న్స్ ప‌తాకంపై క‌లైపులి ఎస్ థాను నిర్మించాడు. ధ‌నుష్‌కు జోడీగా ఎల్లిడ్ ఆవ్ర‌మ్ హీరోయిన్‌గా న‌టించింది. ఇప్పటికే 'తిరు' మూవీతో గ్రాండ్ కంబ్యాక్‌ ఇచ్చిన ధనుష్‌.. ఈ సినిమాతో మరో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.

గ‌త నెల 18న విడుద‌లైన 'తిరు' మూవీ త‌మిళంతో పాటు తెలుగులో కూడా భారీ విజ‌యాన్ని సాధించింది. ఇదిలా ఉంటే వెంకీ అట్లూరీ ద‌ర్శ‌క‌త్వంలో ధనుష్‌ నటిస్తున్న 'సార్' సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

Next Story