అన్నంత పని చేసిన ధనుష్

నయనతార, విఘ్నేష్ శివన్, వారి నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో ఇద్దరిపై తన నిర్మాణ సంస్థ అయిన వండర్‌బార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున ధనుష్ కేసు నమోదు చేశారు.

By Kalasani Durgapraveen  Published on  27 Nov 2024 9:00 PM IST
అన్నంత పని చేసిన ధనుష్

నయనతార, విఘ్నేష్ శివన్, వారి నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో ఇద్దరిపై తన నిర్మాణ సంస్థ అయిన వండర్‌బార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున ధనుష్ కేసు నమోదు చేశారు. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ ధాన్ క్లిప్‌లను అనధికారికంగా ఉపయోగించడంపై కేసు నమోదు చేశారు. నవంబర్ 27న మద్రాసు హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.

విచారణ సందర్భంగా, నయనతార, విఘ్నేష్ శివన్, ఇతరులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలని జస్టిస్ అబ్దుల్ క్విద్దోస్ ఆదేశించారు. నయనతార, విఘ్నేష్ శివన్ ల డాక్యుమెంటర, Nayanthara: Beyond The Fairytale, ఆమె పుట్టినరోజు నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. విడుదలకు ముందు, ధనుష్ NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ చేయడాన్ని తిరస్కరించిన తర్వాత నయనతార ధనుష్‌కి ఘాటైన బహిరంగ లేఖ రాశారు.

Next Story