'శాకుంత‌లం' నుంచి దుష్యంతుడి ఫస్ట్‌లుక్ రిలీజ్‌

Dev Mohan impresses as King Dushyant in Samantha's Shaakuntalam. హీరోయిన్‌ సమంతా రూత్ ప్రభు మెయిన్‌ రోల్‌లో తాజాగా నటిస్తున్న సినిమా 'శాకుంతలం'. ఈ చిత్రంలో

By అంజి  Published on  18 Sept 2022 1:27 PM IST
శాకుంత‌లం నుంచి దుష్యంతుడి ఫస్ట్‌లుక్ రిలీజ్‌

హీరోయిన్‌ సమంతా రూత్ ప్రభు మెయిన్‌ రోల్‌లో తాజాగా నటిస్తున్న సినిమా 'శాకుంతలం'. ఈ చిత్రంలో మ‌ల‌యాళ యువ న‌టుడు దేవ్ మోహన్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. తాజాగా అతడి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్‌ అతడి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. శాకుంతలం అనేది పౌరాణిక నాటకం. ఇందులో సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవ్ మోహన్ ఈ చిత్రంలో రాజు దుష్యంత్ పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో దేవ్‌ మోహన్‌ రాయల్‌గా కనిపిస్తున్నాడు. అడవిలో గుర్రపు స్వారీ చేస్తున్న పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దిల్‌ రాజ్‌ సమర్పణలో గుణ టీమ్‌వర్క్స్ క్రింద నీలిమ గుణ బ్యాంక్రోల్ చేసారు. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కుమార్తె అల్లుఅర్హ కీల‌క‌పాత్ర‌లో నటించింది. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అదితి బాలన్, గౌతమి, అనన్య నాగళ్ల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని వచ్చే ఈ ఏడాది ద్వితియార్థంలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

'రుద్ర‌మ‌దేవీ' మూవీ త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ దాదాపు ఏడేళ్ళ సమయం తీసుకుని 'శాకుంత‌లం' సినిమాని తీస్తున్నాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుదలైన స‌మంత ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న ల‌భించింది. 'బాహుబ‌లి' త‌ర్వాత తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో ఆదరణ వస్తుండటంతో.. దాదాపు అన్ని చిత్రాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో తీస్తున్నారు.


Next Story