యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Delhi High Court issues notice to Prabhas and Adipurush Movie Team.ఆదిపురుష్ చిత్ర‌బృందానికి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Oct 2022 7:51 AM IST
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన తాజా చిత్రం 'ఆదిపురుష్‌'. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజ‌ర్ కొద్ది రోజుల క్రితం విడుద‌లైంది. అప్ప‌టి నుంచి టీజ‌ర్ పై ట్రోల్స్ వ‌స్తున్నాయి. ఇక సోష‌ల్ మీడియా మొత్తం ఆదిపురుష్ ట్రోల్స్‌, మీమ్స్‌తో నిండిపోతున్నాయి. యానిమేటెడ్ చిత్రంలా ఉంద‌ని నిరాశ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆదిపురుష్ చిత్ర‌బృందానికి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. హీరో ప్ర‌భాస్‌తో పాటు చిత్ర‌యూనిట్‌కు నోటీసులు జారీ చేసింది.

రామాయ‌ణం గురించి అధ్య‌య‌నం చేయ‌కుండానే ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారంటూ హిందూసంఘాల నేత‌లు, బీజేపీ నేత‌లు ఓ వైపు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌గా.. హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిందంటూ ఓ సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్ర‌యించింది. సినిమా విడుద‌ల పై స్టే విధించాల‌ని పిటిష‌న్‌లో పేర్కొంది. ఈ పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన ఢిల్లీ న్యాయ‌స్థానం చిత్ర హీరో ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ ఓం రౌత్‌ల‌తో పాటు చిత్ర‌యూనిట్‌కు నోటీసులు జారీ చేసింది.

Next Story