అన్‌స్టాపబుల్ షోకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో విచారణ

Delhi High Court hearing regarding Unstoppable show. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్‌ షోపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

By M.S.R  Published on  30 Dec 2022 3:15 PM GMT
అన్‌స్టాపబుల్ షోకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో విచారణ

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్‌ షోపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నందమూరి బాలకృష్ణ చేస్తున్న హంగామా ఈ షోలో అంతా ఇంతా కాదు. ఆహాలో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ షోలకు లీకుల బెడద ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఆహాలో కాకుండా యూట్యూబ్ లో కూడా పలు ఛానల్స్ లో వీడియోలను, ఎపిసోడ్లను అప్లోడ్ చేసేస్తూ ఉన్నారు. దీంతో అర్హ మీడియా అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ టాక్‌ షోకు సంబంధించిన అనధికార స్ట్రీమింగ్‌, ప్రసారాలను వెంటనే తొలగించాలని టెలికమ్యూనికేషన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ, ఇంటర్నెట్‌ ప్రొవైడర్లను ఆదేశించింది. అనధికారికంగా ఈ షోను ప్రసారం చేయడం వల్ల షోపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. పలు ఎపిసోడ్‌లు అనధికారికంగా ప్రసారం కాకుండా ఆదేశాలు ఇవ్వాలని గురువారం లాయర్‌ ప్రవీణ్‌ ఆనంద్‌, అమిత్‌ నాయక్‌లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తిని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెబ్‌సైట్స్‌తో పాటు ఇతర మీడియా మాధ్యమాలపై చర్యలు తీసుకునేలా 'డైనమిక్‌ ఇంజక్షన్‌' ఇవ్వకపోతే ఫిర్యాదుదారుకి భారీ నష్టం వస్తుందని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ వరకూ మధ్యంతర ఇంజెక్షన్‌ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఇకనైనా అన్ స్టాపబుల్ షోకు లీకుల బెడద తగ్గుతుందో.. లేదో చూడాలి.


Next Story