దీపికాకు ఏమైంది..? షాక్‌లో అభిమానులు..!

Deepika Padukone removes all her posts and tweets from Instagram and Twitter. బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణె న్యూ ఇయ‌ర్ లో అభిమానులకు షాకింగ్ ఇచ్చింది తన పోస్ట్ లను తొలిగించుట ద్వారా.

By Medi Samrat  Published on  1 Jan 2021 11:27 AM GMT
Deepika Padukone removes all her posts and tweets

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణె న్యూ ఇయ‌ర్ రోజునే అభిమానుల‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఏమైందో ఏమో తెలీదు కానీ.. త‌న ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న అన్ని పోస్టుల‌ను తొలగించింది. ఎందుకు ఆమె ఈ విదంగా తొల‌గించింది అన్న స‌మాచారం అయితే లేదు‌. దీంతో ఆమె అభిమానులు దీపిక‌కు ఏమైంది..? ఎందుకు పోస్టులు డిలీట్ చేసింది..? అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ప్ర‌స్తుతం దీపిక ఆమె భ‌ర్త ర‌ణ్‌వీర్‌తో క‌లిసి జైపూర్ లో ఉంది. కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల‌ను జ‌రుపుకునేందుకు అక్క‌డి వెళ్లారు. కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోల‌ను ర‌ణ్‌వీర్ ఇన్‌స్టాలో షేర్ చేసి అభిమానుల‌తో పంచుకున్నాడు. దీపికా కొత్త సంవ‌త్స‌రం వేళ‌ ఎలాంటి పోస్టులు పెడుతుందా అని అంద‌రూ ఎదురుచూస్తున్న వేళ స‌డెన్ షాకిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో దీపికా పోస్ట్‌ల సంఖ్య జీరో చూపిస్తుంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే 52 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఏం జ‌రిగిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ట్విట్ట‌ర్‌లోను పోస్ట్‌లు అన్నింటిని తొల‌గించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమెకు ట్విట్ట‌ర్లో 27 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. మ‌రీ పోస్టులు ఎందుకు డిలీట్ చేసింది అన్న‌ది అమ్మ‌డు చెప్పేవ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే..


Next Story
Share it