ఆస్పత్రిలో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనె.. అసలేమైందంటే?

Deepika Padukone hospitalised in Mumbai after complaining of uneasiness. అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనె సోమవారం రాత్రి ముంబైలోని బ్రీచ్

By అంజి
Published on : 28 Sept 2022 9:53 AM IST

ఆస్పత్రిలో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనె.. అసలేమైందంటే?

అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనె సోమవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అనారోగ్యం కారణంగానే ఆమె ఆసుపత్రిలో చేరారని, అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ మొత్తం విషయంపై దీపిక కానీ ఆమె టీమ్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అదే సమయంలో.. దీపికా చివరిసారిగా 'గెహ్రైయాన్'లో అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వాతో కలిసి కనిపించింది. గత కొన్ని రోజులుగా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటం వలన దీపికా కొంత నీరసానికి గురైందట.

జూన్ నెలలో కూడా దీపిక ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా, ఆమె గుండె వేగంగా కొట్టుకోవడంతో హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించినట్లు రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. అయితే ఈ వార్తలను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఖండించింది. దీపిక ప్రభాస్ సరసన 'ప్రాజెక్ట్ కె' చిత్రంలో నటిస్తోంది, షారుక్ ఖాన్ 'పఠాన్', హృతిక్ రోషన్ 'ఫైటర్'లో కూడా నటిస్తోంది. బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్లలో దీపికా ఒకరు. ఆమె రణ్‌వీర్‌ సింగ్‌తో పెళ్లి తర్వాత సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Next Story