మోదీసార్ ఆరోజు సెలవు కావాలి.. ట్వీట్ వైరల్
Declare National Holiday On July 16th Yash Fans To PM Narendra Modi.'కేజీఎఫ్ చాప్టర్ 2' విడుదల రోజున.. ఫ్యాన్స్ ఎమోషన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆరోజు సెలవు ప్రకటించాలని కోరారు.
By తోట వంశీ కుమార్
'కేజీఎఫ్' చిత్రంతో జాతీయ స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కన్నడ స్టార్ యశ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 2'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జులై 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. సంజయ్‌దత్, రవీనా టాండన్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక రాకీ బాయ్‌ను తెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొందరు అభిమానులు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి ట్విట్టర్‌లో ఓ లేఖ రాశారు.
Dear @PMOIndia @narendramodi sir Consider Fans Emotion🥰😁 And Declare National Holiday On 16/7/2021💥#KGFChapter2 #YashBOSS #KGFChapter2onJuly16 pic.twitter.com/1Idm64pgwV
— Rocking Styles (@styles_rocking) January 30, 2021
'కేజీఎఫ్ చాప్టర్ 2' విడుదల రోజున.. ఫ్యాన్స్ ఎమోషన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆరోజు సెలవు ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ రజినీకాంత్ కు మాత్రమే పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఆయన చిత్రం విడుదల అవుతుందంటే చాలు.. చాలా సంస్థలు తమ కార్యాలయాలకు ఆరోజు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. కబాలీ విడుదల సందర్భంగా తమిళనాడులోనే కాక.. దేశ వ్యాప్తంగా పలు కార్యాలయాలు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
మొదటి భాగంలో మిగిలిన అనేక ప్రశ్నలకు 'కేజీఎఫ్ చాప్టర్ 2' లో సమాధానం లభించనుంది. గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాకీ ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు..? చనిపోయాడు అనుకున్న అధీర ఎలా తిరిగొచ్చాడు..? ఇనాయత్ ఖలీ భారతదేశంలోకి వచ్చాడా..? అన్నది తెలియాలంటే జులై 16 వరకు వెయిట్ చేయక తప్పదు.