బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో రానాను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్ రెమ్యూనరేషన్లు, కమీషన్లపై ఆరా తీస్తున్నారు. గతంలో ముందస్తు బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో హాజరు కాలేక పోతున్నట్లు రానా ఈడీని కోరారు. దీంతో ఆయనను సోమవారం విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నటులు ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక ఈ నెల 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కానున్నారు.