మెగాస్టార్‌ 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్‌

యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న సినిమా 'విశ్వంభర'. ఫాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

By అంజి  Published on  2 Feb 2024 9:55 AM IST
Megastar Chiranjeevi, Vishwambhara movie, Tollywood

మెగాస్టార్‌ 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్‌

'బింబిసార' ఫేమ్‌, యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న సినిమా 'విశ్వంభర'. ఫాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ సంబంధించి మేకర్స్‌ బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాని జనవరి 10, 2025న విడుదల చేయనున్నట్టు మూవీ మేకర్స్‌ ప్రకటించారు. షూటింగ్‌ కొనసాగుతున్నట్టు వెల్లడిస్తూ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. పంచభూతాలు, ముల్లోకాల కాన్సెప్ట్‌కు ఆధ్యాత్మిక అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ ఛోటా కె నాయుడు, సంగీతం యం.యం.కీరవాణి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా ఏఎస్‌ ప్రకాష్‌ ఉన్నారు.

Next Story