'ఆ లావాకు ఓ పేరుంది'.. రవితేజ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌

బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో ఫుల్‌ బిజీ బిజీగా గడుపుతున్నాడు.. మాస్‌ రాజా రవితేజ. 'ధమాకా' మూవీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన

By అంజి  Published on  11 Jun 2023 10:45 AM IST
Hero Ravi Teja,  new movie, Tollywood, Anupama

'ఆ లావాకు ఓ పేరుంది'.. రవితేజ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌

బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో ఫుల్‌ బిజీ బిజీగా గడుపుతున్నాడు.. మాస్‌ రాజా రవితేజ. 'ధమాకా' మూవీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన రవితేజ.. అదే జోష్‌న తన నెక్స్ట్‌ సినిమాలో చూపించలేదు. దీంతో రెండు నెలల కిందట రిలీజైన 'రావణసుర' సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేయలేకపోయింది. పబ్లిసిటీకి అయిన ఖర్చులను కూడా కలెక్ట్‌ చేయలేకపోయింది. ప్రస్తుతం రవితేజ తన ఆశలన్నీ 'టైగర్‌ నాగేశ్వరరావు' సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేశారు. గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. దసరా కానుకగా రిలీజ్‌ కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా రవితేజ కొత్త సినిమాకు సంబంధించి చిత్ర బృందం క్రేజీ అప్‌డేట్‌ని ప్రకటించింది. పీపుల్‌ మీడియా బ్యానర్‌పై రవితేజ తన కొత్త సినిమా చేయనున్నారు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం కానున్నారు. కార్తీక్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు 'ఈగల్‌' అనే పేరును పరిశీలనకు ఉంచినట్లు సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ఎలాంటి సౌండ్‌ లేకుండా జరుగుతోంది. 'ఆ లావాకు ఓ పేరుంది ఆ నామం 48 గంటల్లో ఆవిష్కృతం' అంటూ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రేపు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రతీకార నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హాలీవుడ్‌ చిత్రం 'జాన్‌విక్‌' ఆధారంగా రూపొందిస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో రవితేజకు జోడీగా అనుపమ, కావ్య థాపర్‌ నటిస్తున్నారు.

Next Story